Thursday, April 3, 2025

ఎస్‌ఎల్‌బిసిపై కీలక ప్రకటన చేసిన పొంగులేటి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బిసిలో ప్రమాదం జరిగి 40 రోజులు దాటుతున్న వేళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదం జరగడం అత్యంత బాధకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని.. మరో 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించారు.

అయితే ఈ ప్రాజెక్టును ఎన్ని ఇబ్బందులు ఎదురైన పూర్తి చేస్తామని తెలిపిన మంత్రి ప్రమాద్ంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోగా.. ఇద్దరి మృతదేహాలను ఇప్పటివరకూ బయటకు తీశారు. మిగితా మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News