Monday, December 23, 2024

అనేక కష్టాలు..అవమానాలు ఓర్చుకున్నా:మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: గత ప్రభుత్వ హయాంలో తాను ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కోన్నానని, పలు సందర్బాల్లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గత ఏడాది ఇదే సమయంలో తనతో పాటు తనను నమ్ముకున్న వాళ్ళను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు, అవమానాలకు గురిచేసిందని, ఆ సమయంలో తన అనుచరులందరికీ తనను కలిసిన సమయంలో బాధను దిగమింగి….వారికి ధైర్యం చెప్పానని, తన బాధను కూడా వ్యక్త పరిస్తే వాళ్ళంతా ఎక్కడ ఇబ్బంది పడతారోననే ఉద్దేశ్యంతో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు కార్చానని అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలో భక్తరాందాస్ కళాక్షేత్రంలో రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో మంత్రి ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఏదీ ఒట్టిగా రాలేదని.. ఎన్నో కష్టాలకు వర్చుకుంటే ఇక్కడిదాగా వచ్చామన్నారు.

ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటదని,  పతి సుఖం వెనుక కష్టం ఉంటదని చెపుతూ తాను పడిన కష్టం ఒట్టిగా పోలేదన్నారు. ఈ సందర్భంగా రైట్ చాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో గతేడాది నిర్వహించిన నిరుద్యోగుల సదస్సు నుంచే బిఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తాను గళం వినిపించిన విషయాన్ని పొంగులేటి గుర్తు చేసుకున్నారు.. పజలు గత ప్రభుత్వంతో విసిగి పోయి మార్పును ఆశించి ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత వివక్షకు గురయ్యారని..నిరుద్యోగులు అందరూ కలసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని.. టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి నాయ్యం జరుగుతుందని హామీ ఇచ్చారు.

పొంగులేటి రాజకీయ ప్రస్థానంపై లఘు చిత్రం
రాజకీయాల్లోకి వచ్చింది మొదలు… మంత్రి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానంపై తయారుచేసిన లఘుచిత్రంను ఈ సభలో ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీని రూపొందించిన రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ను పొంగులేటితో పాటు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆకెళ్ళ రాఘవేంద్ర, ప్రొఫెసర్ చింతా గణేష్, ప్రసన్న హరికృష్ణ మద్దినేని బేబి స్వర్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News