Wednesday, March 26, 2025

భూభారతి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు

- Advertisement -
- Advertisement -

త్వరలో భూముల ధరలు పెంచబోతున్నాం అసైన్డ్ భూముల అమ్మకానికి
అవకాశం లేదు రాష్ట్రవ్యాప్తంగా 6వేల మందికి సర్వేయర్ల్లుగా ఛాన్స్
సాదాబైనామాల కొత్త దరఖాస్తులు స్వీకరించం ఆన్‌లైన్‌లో నమోదు అయిన
వాటికి పరిష్కారం ఎల్‌ఆర్‌ఎస్‌కు మంచి స్పందన వస్తోంది ఇప్పటికైతే
గడువు పొడిగించే అవకాశం లేదు ఎంఎల్‌ఎ అనిరుధ్‌తో నాకు విభేదాలు లేవు
మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చిట్‌చాట్

మన తెలంగాణ/హైదరాబాద్ : త్వరలో రాష్ట్రంలో భూముల ధరలు పెంచబోతున్నామని, భూ భారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నా రు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ లాబీలో సోమవా రం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భం గా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ సర్వే కో సం ప్రతి మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌లను నియమిస్తామని చెప్పారు. భూమి సర్వే కావాలంటే అమ్మకం, కొనుగోలు దారుల విజ్ఞప్తి మేరకే జరుగుతుందని, అది చట్టంలో ఉందని ప్ర భుత్వం ప్రత్యేకంగా భూ సర్వే ఏమీ చేయమని, పొజిషన్‌లో ఉన్న భూమికి, రికార్డులకు చాలా తే డా ఉందని ఆయన పేర్కొన్నారు. 10,956 విఆర్ ఓ పోస్టులను మంజూరు చేశామని, ఉన్న విఆర్‌ఓ, విఆర్‌ఏలకు ఇంటర్ విద్యార్హతగా పెట్టామని ఆయ న తెలిపారు. అలాగే లైసెన్స్ సర్వేయర్లకు అవకా శం ఇప్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది లైసెన్స్ సర్వేయర్లకు అవకాశం ఇస్తామని,

వీరికి శిక్షణ ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం మార్చి 31వ తేదీ వరకు గడువు ఉం దని, ఆ లోగా డబ్బులు చెలించిన వారికి 25 శా తం డిస్కౌంట్ ఇస్తున్నామని మంత్రి పొంగులేటి వె ల్లడించారు. పేమెంట్ చెల్లించగానే పురపాలక శా ఖ ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్దీకరణకు సంబంధించి ధ్రు వీకరణ పత్రం ఇస్తున్నామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఆశించిన స్పందన ఉందని అయితే గడువు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే లేదని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఇప్పుడు కట్టకపోతే ఇల్లు కట్టుకోవడానికి అనుమతి కావాలనుకున్నప్పుడు 100శాతం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును కట్టాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అక్రమ లే ఔ ట్లు రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అవుతున్నారని, ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరని, భూమికి మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి నిర్ధారిస్తామని ఆయన పేర్కొన్నారు.

15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం
భూ భారతి పూర్తి దాదాపు పూర్తయ్యిందని, త్వరలోనే దానిని అందుబాటులో తెస్తామని ఆయన తెలిపారు. ధరణి సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యాయని ఆయన అన్నారు. భూ భారతిలో భాగాంగా రిజిస్ట్రేషన్‌లకు స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని, ఆధార్‌తో లింక్ చేస్తామని, 15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం దాదాపు 40 నిమిషాలు పడుతోందని, రాష్ట్రంలో దాదాపు 15 చోట్ల పైలెట్ ప్రాజెక్టులు చేపట్టామని, అక్కడ అమల్లో వచ్చే ఇబ్బందులను అధిగమించి రాష్ట్ర వ్యాప్తంగా దానిని అమలు చేస్తామని ఆయన తెలిపారు.

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, నా మధ్య ఎలాంటి సమస్య లేదు
తనకు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మధ్య ఎలాంటి సమస్య లేదని, తనకు ఏ ఎమ్మెల్యేతో ఇబ్బంది లేదని, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెబుతున్న అభిమన్యు రెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని మంత్రి స్పష్టం చేశారు. సమస్య ఉంటే దానికి పరిష్కారం చూపుతామని, వ్యక్తులను చూడమని, పరిష్కారం చేయగలిగినవే చేస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
రిజెక్ట్ చేసిన దరఖాస్తులు అథారిటీలో అప్పీల్
అలాగే సాదాబైనామాల విషయంలో కొత్త దరఖాస్తులు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. 13 లక్షల పాత దరఖాస్తులను గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. రిజెక్ట్ చేసిన దరఖాస్తులను అప్పీలేట్ అథారిటీలో అప్పీల్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో ఆన్‌లైన్‌లో నమోదైన 12 లక్షల సాదాబైనామాలు మాత్రమే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అసైన్డ్ భూములు అమ్ముకోడానికి అవకాశం లేదని ఆయన తెలిపారు.

అర్భన్ ఏరియాలో లక్షా 13 వేల ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల పేర్ల మార్పు ఏమీ ఉండదని, తాము రూ.5 లక్షలు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూరల్ లో ఒక ఇంటికి రూ.72వేలు ఇస్తుందని, అర్బన్ లో అయితే రూ.1.5లక్షల ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ప్రధాని ఆవాస్ యోజన కింద అర్భన్ ఏరియాలో లక్షా 13 వేల ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం 1.50 లక్షలు మాత్రమే ఇస్తుందని, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రూరల్ ఏరియాకు సంబంధించి కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News