Friday, December 20, 2024

గృహజ్యోతి పథకం కింద సున్నా బిల్లులు జారీ

- Advertisement -
- Advertisement -

గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులు నేటి నుంచి గృహజ్యోతి పథకం కింద సున్నాబిల్లులు జారీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేసిన ఆయన కోడ్ ముగియడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులను ప్రభుత్వం జారీ చేస్తుందని, ప్రజా ప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమం అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

కాగా, ఇంటి అవసరాల నిమిత్తం 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి 27వ తేదీన సిఎం ప్రారంభించగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకం అమలు కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News