Wednesday, January 8, 2025

31లోగా లబ్ధిదారుల ఎంపిక

- Advertisement -
- Advertisement -

సమీక్షాసమావేశంలో మాట్లాడుతన్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపి కడియం కావ్య

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: రాష్ట్రం లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అందిస్తామని గృ హ నిర్మాణ రెవెన్యూ, సమాచార శాఖ మం త్రి, వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇందిరమ్మ ఇతర పథకాలు, అభివృద్ధి పనులపై సోమవారం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష ని ర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్.గుండు సుధారాణి, ఎంఎల్‌సి బసవరాజు సారయ్య, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, దొంతి మాధవరెడ్డి, కె ఆర్ నాగరాజ్, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, కుడా ఛైర్మన్ ఇనగల వెంకటరామిరెడ్డి జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల సర్వే పురోగతి, భద్రకాళి చెరువు పూడికతీత అభివృద్ధి తదితర అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూలంకషంగా సమర్థ నిర్వహణకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత వరంగల్ పట్టణం, వరంగల్ ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించారని అన్నారు. హైదరాబాద్ తో సమానంగా పాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ఆలోచనని, దానికి అనుగుణంగా మొదటి సంవత్సరం పూర్తి కాకముందే సిఎం రెండు పర్యాయాలు వరంగల్ పట్టణానికి వచ్చారని అన్నారు.

మొదటిసారి పర్యటన సందర్భంగా చేయాల్సిన అభివృద్ధిపై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి అభిప్రాయాలను తీసుకొని విమానాశ్రయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. రెండో సారి పర్యటనలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని, 6 వేలకు పైగా వరదలాగా నిధులు మంజూరు చేశారని అన్నారు. 2041 మాస్టర్ ప్లాన్ మంజూరు చేశారని అన్నారు భద్రకాళి చెరువు పూడికతీత, వివిధ అభివృద్ధి, మౌలిక వసతులు కల్పనకు టెండర్లు పిలిచామని అన్నారు. హైదరాబాదు మాదిరిగానే వరంగల్‌లో కూడా కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు లాంఛనంగా ప్రారంభించుకున్నామని, సంక్రాంతిలోపు రెండో విడతలో మరికొన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2004 నుండి 2014 వరకు 25 లక్షల ఇల్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తామని కలలు కలలుగానే ఉంచిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు చేస్తూ, 4 సంవత్సరాల లో 80 లక్షల ఇళ్ల నిర్మించే లక్ష్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదోడి కల నెరవేర్చాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అన్నారు.

దరఖాస్తు చేసుకున్న ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకు లోను కావద్దని, రాజకీయాలకతీతంగా నీరుపేదలకు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం మొండిగోడలతో వదిలేసిన 1.5 లక్షల ఇళ్ల పూర్తి చేస్తామన్నారు. ప్రజా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా , ఇంటింటికి సర్వే నిర్వహించి ఇప్పటికే 65 లక్షల మంది వివరాలు యాప్ ద్వారా సేకరించామని తెలిపారు. రైతు భరోసా విషయంలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పర్యటించి రైతుల నుండి అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 26వ తేదీ నుండి వ్యవసాయ యోగ్యత గల భూమికి ప్రతి సంవత్సరం ఎకరాకు రైతు భరోసా కింద 12 వేల రూపాయలు అందిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా భూమిలేని పేద వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు చెల్లిస్తామని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో కేవలం 108 వేల రేషన్ కార్డులు మంజూరు చేసి కొన్ని తొలగించిందని అన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News