Sunday, December 22, 2024

ఒక్క కేసుకే వణుకా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మంబ్యూరో: ఈ -కా రు రేస్ అక్రమాల కేసు నుంచి బయటపడేందుకు ఢిల్లీలోని బిజెపి పెద్దల దయాదాక్షిణ్యాల కోసం వారి కాళ్ళపై పడి ప్రాధేయేపడేందుకు బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ హడావుడిగా ఢిల్లీకి వెళ్ళారని మం త్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం, చిన్నవెంకటగిరిలో జరిగిన ఒ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కెటిఆర్‌పై ఘాటై న వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో గ వర్నర్ నుంచి అనుమతి రాగానే ఈ -కా రు రేసు కేసులో ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. బిజెపి నేతలకు పాదాభివందనం చేసినా లాభం లేదని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని వ్యాఖ్యానించారు. “ఈ నిమిషంలో మీ రు ఎక్కడ
ఉన్నారు.. కేంద్ర మంత్రితో మీకున్న పని ఏమిటి.. మీరు మంత్రిగా,

మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ కారు రేస్ విషయంలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు, అందులో నుంచి బయట పడేందుకు ఢిల్లీ వెళ్లావా కెటిఆర్’ అంటూ మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదానీ, అంబానీ, బిజెపిలోని నెంబర్ వన్, టూ, త్రీలను కలిసి కాళ్లు మొక్కి, కేసును పక్కదారి పట్టించేందుకే ఢిల్లీ వెళ్లారంటూ ఫైర్ అయ్యారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ కారు రేసు కేసులో ఓ ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలంటే గవర్నర్ నుంచి అనుమతి తప్పనిసరి అని, 13 రోజుల క్రితమే అనుమతి కోసం ఏసిబి గవర్నర్‌కు లేఖ రాసిందని, మరో రెండు రోజుల్లో క్లియరెన్స్ రానుందని.. దానిని నిలిపివేసేందుకు కెటఆర్ హడావిడిగా ఢిల్లీ వెళ్లారని, ఢిల్లీలో ఉండే కేంద్ర పట్టణాభివ్రద్ది శాఖ మంత్రిని ప్రాధేయపడి కేసును పక్కదారి పట్టించేందుకు ఢిల్లీ వెళ్లారా? అని పశ్నించారు.

‘అదానీ, అంబానీ, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలోని నెంబర్ వన్, టూ వద్దకు వెళ్లి గతంలో లిక్కర్ స్కాం కేసులో మీ చెల్లి కవిత కేసులో బెయిల్ సంపాదించుకున్న విధంగా ఈ కేసులో కూడా కేంద్ర పెద్దల సహాయం పొందేందుకు వెళ్లింది నిజం కాదా? ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధం అన్నారు.“ ఏ బాంబో పేలుతుందో మీకు తెలిసే, రాబోయే రెండు రోజుల్లో జరిగే పరిణామాలు పసిగట్టే హుటాహుటిన ఢిల్లీకి పరుగులు తీశారన్నారు. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలికిపడుతున్నారని.. ఏదో కొంపలు అంటుకున్నట్లు ఢిల్లీకి ఎందుకు ప్రయాణం అయ్యారని నిలదీశారు. ఫార్ములా – ఈరేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు 55 కోట్లను ఏవిధంగా మళ్లించారని మంత్రివర్గ తీర్మానం లేకుండా, ముఖ్యమంత్రి అనుమతి లేకుండా కెటిఆర్ విదేశాల్లోని తన తొత్తు సంస్థలకు నిధులు మళ్లించారని ఆరోపించారు. ఫార్ములా – ఈరేసింగ్ నిర్వహణకు సంబంధించిన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోకముందే కెటిఆర్ నిధులను మళ్లించారని, ఎవరి అనుమతి తీసుకోకుండా రూ.55 కోట్ల నిధులను ఏవిధంగా మళ్లించారని ప్రశ్నించారు. ఫార్ములా – ఈరేసింగ్ లో ఏ చట్టం ప్రకారం విదేశాలకు నిధులను పంపారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

అన్నీ బయటపెడితే అంతరిక్షంలో వెళ్లి దాక్కోవాలి
పదేళ్ళ కాలంలో అధికారంలో ఉండి, దొర పరిపాలన చేసిన రోజుల్లో విద్యుత్, కాళేశ్వరం, భూములు, సమాచార శాఖ వంటి అనేక శాఖల్లో అవినీతి రాజ్యమేలిందని, వాటి లెక్కలు తీస్తే బిఆర్‌ఎస్ నాయకులు భూమ్మీద కాదు.. అంతరిక్షంలో దాక్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ఏడో వింత తర్వాత ఎనిమిదో వింత అన్న కేసీఆర్.. ఆ ఎనిమిదో వింత ఎవరూ కూలగొట్టక ముందే కుంగిపోవడానికి కారకులు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దర్యాప్తు ముందుకు సాగుతుందని, ఖమ్మం జిల్లాలో తన ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని,

జిల్లాలో జరిగిన డబుల్ బెడ్ రూం ఇండ్ల అవకతవకల్లో కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇద్దరు, ముగ్గురు పెయిడ్ ఆర్టిస్టులకు కండువాలు కప్పి.. ‘మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే, ఇందిరమ్మ ప్రభుత్వం అరెస్టులు చేయాలని చూస్తోంది’ అనడం సిగ్గుచేటన్నారు. గతంలో దోచుకోకుండా మిగిలి ఉన్న దానిని మళ్లీ వచ్చి దోచుకుందామంటూ హితబోధ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఉన్న నాయకులను చేజారి పోకుండా వారిని నమ్మించేందుకు కష్టపడటం చూసి నవ్వొచ్చిందని అన్నారు. పేదవారి స్వార్జితాన్ని ఏనాడూ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చదని, అక్రమంగా నిర్మాణాలు చేసిన బడాబాబుల విషయంలో మాత్రం ఉరుకునే ప్రసక్తే లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News