Saturday, December 21, 2024

కెసిఆర్ మాదిరిగా విదేశీ కుట్ర అంటూ ఫాంహౌస్‌లో కూర్చోలేదు:పొంగులేటి

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ మాదిరిగా విదేశీ కుట్ర అంటూ ఫాంహౌస్‌లో కూర్చోలేదని, చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నామని, మా ముందస్తు చర్యల వల్ల వీలైనంత ప్రాణ నష్టం తగ్గించగలిగామని, గత ప్రభుత్వం పదేళ్లలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్‌ఎస్ నాయకులు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజల రక్షణే తమకు ముఖ్యమన్నారు. వరదలపై మంగళవారం ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను బుధవారం మంత్రి పొంగులేటి తప్పుబట్టారు. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వర్షాలు, వరదలు నుంచి ప్రజల దృష్టిని మళ్లీంచడానికి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి క్లౌడ్-బరస్ట్, విదేశీ కుట్ర అంటూ మతిలేని ప్రకటనలు చేసిన బిఆర్‌ఎస్ నాయకులకు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆ ప్రకటనలో ప్రశ్నించారు. విదేశీ కుట్ర అని ఫాంహౌస్ దాటని బిఆర్‌ఎస్ పార్టీ పెద్దలు ఈరోజు వరదల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆనాడు ప్రకృతిపరంగా కురిసిన వర్షాలను కూడా కుట్రకోణంలో చూసిన ఆ పెద్దమనిషి, ఆయన అల్లుడు హరీష్ రావు కూడా ఇప్పుడు వచ్చిన వర్షాలను కుట్ర కోణంలోనే చూస్తున్నారా అని మంత్రి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News