Friday, November 22, 2024

రెండు రోజుల్లో రాజకీయ బాంబులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సియోల్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో రాష్ట్రంలో (తెలంగాణ) పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని అ న్నారు. మూసీనదీ ప్రక్షాళనకు చేపట్టబోయే అంశాలను అ ధ్యయనం చేయడానికి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి దక్షిణకొరియా ప ర్యటనలో ఉన్న మంత్రి బుధవారం అక్కడ ఒక తెలుగు న్యూ స్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అక్కడ (ఇండియా) దిగేలోపలనే చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఇవీ ప్రధాన నాయకు లకు బిగ్ షాకింగ్ అవుతుందని మంత్రి హింట్ ఇచ్చారు. గ త బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్ర మాలకు సంబంధించినఫైళ్లు,

సాక్షాధారాలను తమ ప్రభు త్వం సేకరించిన తర్వాతనే ఈ చర్యలు తీసుకోబోతున్నామ ని మంత్రి పేర్కొన్నారు. పక్కా సాక్షాధారాలను సేక రించడంలో భాగంగా జాప్యం జరిగిందన్నా రు. ఈ కారణంగా ఆ లస్యం కావడంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీ తి, అక్రమాలపై చర్యలు ఎందుకు తీసు కోవడం లేదని ప్రజల్లో అనుమానాలకు ఆ స్కారం ఏర్పడిందన్నారు. కానీ ప్రభు త్వం ఏది చేసినా పకడ్బందీగా చేస్తుందని, దాని వల్లే ఆలస్యం జరిగిందని వివరించా రు. చర్యలను తామేదో రాజకీయ కక్ష సాధింపుతో తీసుకుంటున్నవి కావని మం త్రి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళే శ్వరం, ధరణితో పాటు అం శాలకు సంబంధించిన అవినీతి,
అక్రమాలపై మంత్రి స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News