Sunday, December 22, 2024

ఈక, తోక తెలిసే కూలే కాళేశ్వరం కట్టారా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :ఈక, తోక తెలిసిన వ్యక్తి నిర్మించిన కాళేశ్వరం ప్రాజె క్టు మూడేళ్లకే కుప్పకూలిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ రోపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నా ఈక తెల్వదు తోక తెల్వదు, ఈ ప్రభుత్వానికి వెంట్రుక కూడా తెలవదని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొంగులేటి తీ వ్రంగా ఖండించారు. పబ్లిక్ మెమొరీ ఈజ్ వెరీ షార్ట్ అని ఏ మహానుభావుడు అన్నాడో కానీ, అది అక్షరాల నిజమన్నారు. అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి రాగానే, ప్రతిపక్ష నేత కెసిఆర్‌కు రైతులు, నీతులు గుర్తొచ్చాయని ఆయన పేర్కొన్నారు. నీతులు వ ల్లిస్తున్న కెసిఆర్ పది ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా? కరీంనగర్ దాకా పోయిన  వ్యక్తి అక్కడే ఉన్న కాళేశ్వరాన్ని సందర్శిస్తే బాగుండేదని మంత్రి పొంగులేటి సూచించారు. రైతు ప్రేమికుడిగా కెసిఆర్ పర్యటనలు, ప్రకటనలు ఉదరగొడుతున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.

కెసిఆర్ ప్రకటనులు చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు. కెసిఆర్ గతం, వర్తమానం అంతా నటన అని, అహంకారం నియంతృత్వం అవినీతిమయమేనన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంతో తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడి, అధికారం కోల్పోగానే, రాత్రికి రాత్రే ప్రజాప్రేమికుడిగా ఫోజు కొడుతున్న అహంకారవాధి కెసిఆర్ అని ఆయన ఆరోపించారు. వర్షభావ పరిస్థితుల వల్లనే రాష్ట్రంలో కరువు కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఆమాత్రం తెలియదా? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.

ఏనాడు పంట పొలాలకు వెళ్లి, రైతులను పరామర్శించలేదు..?
వర్షాభావ పరిస్తితులను ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపడానికి, ప్రతిపక్ష నేత కెసిఆర్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. మొన్న నల్గొండ పర్యటన, నేడు కరీంనగర్ పర్యటనలు ఇందులో భాగమేనన్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి కెసిఆర్ రైతులను పావులుగా వాడుకోవడం బాధాకరమన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లు సిఏంగా ఉన్న కెసిఆర్ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే, ఏనాడు పంట పొలాలకు వెళ్లి, రైతులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు. అకాల వర్షాలతో వరి పంట దెబ్బతిని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైతే పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు.

అధికారం పోగానే కెసిఆర్‌కు రైతులు గుర్తుకు వస్తున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పరిధిలో ఆయకట్టుకు, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో కెసిఆర్ ఆరోపిస్తున్న వ్యవసాయ సంక్షోభానికి కారణం కెసిఆర్ కాదా అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బిఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే కరువు ఏర్పడిందన్నారు. ఇందులో మా ప్రభుత్వానికి ఏ పాత్ర లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికే రాష్ట్రంలో వర్షాకాలం సీజన్ ముగిసిందని, బిఆర్‌ఎస్ పాలనలోని రాష్ట్రంలో అవసరమైన మేరకు వర్షపాతం నమోదు కాలేదని మంత్రి తెలిపారు. ప్రకృతి వల్ల ఏర్పడిన కరువును కాంగ్రెస్ వైపల్యంగా చెప్పడానికి కెసిఆర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News