ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. ప్రభుత్వ డేటా దాచడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసన మండలి లో కుల గణన, బిసి రిజర్వేషన్ల పై జరిగిన చర్చలో ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్నకి సమాధానమిచ్చారు. కుల సర్వేపై సభ్యులు సమాచారం ఇచ్చా రని, సర్వేలో పాల్గొన్నారు, ప్రత్యక్ష ఫీల్డ్ విజిట్ చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి 150 ఇళ్లను ఒక యూనిట్‌గా తీసుకొని ఆ 150 ఇళ్లకు ఒక ఎన్యుమరెటర్ ని 10 మంది ఎన్యుమరెటర్లకు ఒక పరిశిలకుడిని పెట్టీ వికేంద్రీకరణ ద్వారా శిక్షణ ఇచ్చి ప్రశ్నావళి ఇచ్చి సమాచారాన్ని సేకరిం చామని వెల్లడించారు. స్వచ్ఛందంగా తెలంగాణ సమాజం సమాచారం ఇచిందని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు 56 శాతంగా ఈ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయని వెల్లడించారు. బిసి మేధావులను, ఫ్రొఫెసర్ పని సంఘాల నాయకులను, మా ఛాంబర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశా, వారు మూడు అంశాలు కోరారన్నారు. మిస్ అయిన వారు ఉంటే అప్లికేషన్ పెట్టుకోవటానికి అవకాశం ఇవ్వాలని కోరారని వెల్లడించారు.
గత నెల 12 నుండి 28 వ తేది మధ్య ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రజా పాలన కార్యాలయాలలో పోన్ ద్వారా సమాచారం ఇస్తే ఇంటి వద్దకు వచ్చి సమా చారాన్ని సేకరించారని, సమాచారాన్ని సేకరించి 18 వ తారీఖు చట్టం చేస్తున్నామని వెల్లడించారు. చట్టం చేసి కేంద్రం వద్దకు పోయి స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేస్తున్నామని తెలిపారు. దీనిని అమలు చేసుకునే దిశగా బలహీన వర్గాల బిడ్డగా శాతానికి సంబంధించి ఈ మేజర్ అంశానికి విఘాతం చేయవద్దని కోరారు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని చెప్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో అధికారంలో అన్న పార్టీ కుల గణన చేయడం లేదన్నారు.56 శాతం బిసి జనాభాకి 42 శాతం రిజర్వేషన్ లు చేస్తున్నామని, దీనిపై రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. ఇడబ్లూఎస్ కోసం 10 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేశారు. దానిని రోల్ మోడల్ తీసుకొని ఎందుకు చేయరు అని అడిగడానికి ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ‘సర్వేలో పాల్గొన్నాం. అందరం సమాచారం ఇచ్చాం. ప్రత్యక్షంగా నేను పర్యవేక్షించాను. సమాచారం ఏమైనా పొరపాటు ఉంటే అడగండి. ఆరోపణలు చేస్తే పొరపాటు. 150 ఇళ్లకు ఒక స్టిక్కర్ వేసి ఒక ఎన్యుమారెటర్ ను వేసి సమాచారాన్ని సేకరించాం.
కొంత మిగిలి ఉంటే హైదరాబాద్ , వరంగల్ కార్పొరేషన్ లలో మిగిలి ఉంటాయి. ఈ సమాచారం ద్వారా 42 శాతానికి రాజకీయంగా ,విద్యా , ఉపాధి పరంగా రిజర్వేషన్లకు చట్టబద్ధం చేస్తున్నాం. దీనికి ఎలాంటి ఆటంకం లేకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలి. దీనికి సంబంధించి చట్టం ఎలా చేద్దాం అని సలహా ఇవ్వండి.కేంద్రం దగ్గరకు వెళదాం అడుగుదాం..ఎలా అమలు చెద్దమో కోట్లాడుదాం. లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను చీఫ్ సెక్రటరీ నుండి గ్రామ స్థాయి వరకు వాడాం. పారదర్శకంగా ఎక్కడ పొరపాటు జరగకుండా రాజకీయ ప్రమేయం లేకుండా స్వచ్ఛంద సమాచారం జరిగింది. 56 శాతం బిసి జనాభా వచ్చింది. కుల గణన తరువాత రిజర్వేషన్లు అమలు కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా వేసుకున్నాం. ఈ అమలు జరగాల్సిందే అని ప్రభుత్వం ముందుకు పోతుంద’ని వెల్లడించారు.