స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే గత రెండురోజులుగా హు స్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్థేశిస్తున్నారు. గురువారం సైతం హుస్నాబాద్ నియోజకవర్గంలోనిచిగురుమామిడి, సైదాపూర్, తదితర మండలాల్లో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తూ ముందుకు సాగు తుందని అన్నారు. ప్రజా సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సంక్రాంతికి
రైతుభరోసా అందిస్తామని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటామనిపేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ద గ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోకస్ పెట్టారు. గత రెండు రోజులుగా పలు మండలాలలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ దిశా నిర్థేశనం చేస్తున్నారు. గ్రా మాల్లో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకరావాలని సూచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రజల వద్దకు వెళ్లి గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇ చ్చిన హామీలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికే 200 యూనిట్ల ఉచి త విద్యుత్, 500లకే గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం అమలు చేయడంతో 90శాతం ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని పేర్కొంటున్నారు. ఏడాది కాలంలోనే హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవం పెరిగిందన్నారు. ఇప్పటికే 55వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. సన్న వడ్లకు 500బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు.
అదే విధంగా రైతులకు ప్రభుత్వం 2లక్షల రుణమాఫీ చేసిందని, గురుకుల పాఠశాలలకు డైట్ చార్జీలు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు గ్రామాల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు అందించడమే ప్రధాన లక్షమన్నారు. సంక్రాంతికి రైతుభరోసా అందిస్తామని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే 30వేల కోట్ల వ్యవసాయం రైతు సంక్షేమం కోసం కేటాయించామన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని కార్యకర్తలకు, ముఖ్య నేతలకు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త సైనికుడిల్లా పని చేయాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజా సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లి సూచిస్తూ పార్టీ శ్రేణులతో సమావేశాలను నిర్వహిస్తున్నారన్నారు.