Wednesday, January 22, 2025

ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

అంబేడ్కర్ విగ్రహం వద్ద 80 కొత్త ఆర్టీసీ బస్సులు శనివారం ప్రారంభం అయ్యాయి. ఆర్టీసీ బస్సులను మేయర్ గద్వాల్ విజయ లక్ష్మితో కలిసి రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దీంతో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఎసి, 20 లహరి స్లీపర్, సీటర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు, ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేయాలని సిఎం చెప్పారని సూచించారు. సిసిఎస్ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని చెప్పారు. ఓఆర్ వంద శాతానికి చేరుకుందన్న మంత్రి పొన్నం తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని మంత్రి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News