Monday, January 20, 2025

త్వరలో కొత్తగా వెయ్యి ఆర్‌టిసి బస్సులు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : త్వరలో కొత్తగా వెయ్యి ఆర్‌టిసి బస్సులు వస్తున్నాయని, అవి వస్తే ప్రయాణికులెవరికీ ఇబ్బందులు ఉండవని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలసి మహబూబ్‌నగర్‌లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ.. నందిగామ నుండి షాద్‌నగర్ వరకు ఆర్‌టిసి బస్సులో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం, దీని వల్ల ఆదా అవుతున్న డబ్బులు, తదితర వివరాలు అడిగారు.

తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్‌టిసిలో ఉచిత ప్రయాణం, రూ. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇదే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రయాణికులకు తెలిపారు. పలువురు ప్రయాణిస్తున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్‌టిసి కండక్టర్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన మాట్లాడుతూ..బ్యాండ్స్ అమలు చేస్తున్నామని, త్వరలోనే పిఆర్‌సి అమలుకు చర్చిస్తున్నామని, ఆర్‌టిసిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News