Monday, January 20, 2025

మాది కాలయాపన చేసే ప్రభుత్వం కాదు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: మాది కాలయాపన చేసే ప్రభుత్వం కాదనీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో ఇంటికి సుమారు వెయ్యి రూపాయల విలువజేసే కరెంట్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీటర్ రీడింగ్ తీసి జీరో బిల్లులను మంత్రి మహిళలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చేస్తున్న కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి, కానీ, అనవసరమైన విమర్శలు వద్దని ఆయన హితవు పలికారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్ధానాలు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News