Wednesday, December 25, 2024

మార్చిలోపు సర్పంచ్‌లకు బకాయిలు చెల్లిస్తాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:సర్పంచ్‌లకు మా ర్చిలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ర వాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తె లుసు అని, సర్పంచ్‌లు ఓపిక ప ట్టాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చే శారు. సర్పంచ్‌లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పాపమే నేడు సర్పంచ్‌ల ఆం దోళన అని, సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కారణం బిఆర్‌ఎస్ నాయకులని, నేడు సర్పంచ్‌లకు మద్ధతుగా బిఆర్‌ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బిఆర్‌ఎస్ నేత లు రాష్ట్రంలో సర్పంచ్‌ల గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీల ఉచ్చులో సర్పంచ్‌లు పడొద్దని ఆయన తెలిపా రు. సర్పంచ్‌ల బకాయిలకు ప్రభు త్వం గ్యారెంటీ ఇస్తుందని, పొలిటికల్ పార్టీల ట్రాప్‌లో పడొద్దని మంత్రి వారికి సూ చించారు. సర్పంచ్‌లకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

కిషన్ రెడ్డి రక్తంలో తెలంగాణ డిఎన్‌ఏ లేదు
కెసిఆర్ సలహాతోనే కిషన్ రెడ్డి బిజెపి అధ్యక్షుడు అయ్యారని కిషన్ రెడ్డి విమర్శలు చేస్తే ఊరుకోవాలా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేశారో చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమిటో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి రక్తంలో తెలంగాణ డిఎన్‌ఏ లేదని, తెలంగాణ డిఎన్‌ఏ ఉంటే ఈ రాష్ట్రం కోసం ఏదైనా చేసేవారని ఆయన తెలిపారు. వరద నష్టం నివేదికను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు నివేదిక ఇస్తే పది వేల కోట్ల నష్టానికి కేవలం రూ.400 వందల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను బిఆర్‌ఎస్ రెచ్చగొడుతుందని ఈ రెచ్చగొట్టే కార్యక్రమం ముగిశాక న్యాయం చేయడానికి తాము వెళతామన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ అయితే శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ బిఆర్‌ఎస్ అని ఆయన విమర్శించారు.

ఎవరు కాదన్నా కులగణన ఆగదు
ఎవరు కాదన్నా కులగణన ఆగదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులగణనకు ప్రభుత్వం ముందుకు వెళుతుంటే ఇది ఇష్టం లేని కొన్ని రాజకీయ పార్టీలు కళ్లల్లో కట్టేలు పెట్టేలా అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. భవిష్యత్‌లో ప్రతిపక్షాల ఉనికి ఉండాలంటే కులగణనకు సహకరించాలన్నారు.
నైట్ పార్టీలపై నిషేధం లేదు
హైదరాబాద్ శివార్లలో ఫాంహౌస్ కల్చర్, నైట్ కల్చర్ నడుస్తోందని, వాటిపై తాము ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణలో మద్యపాన నిషేధం కూడా లేదని, కానీ, అదంతా చట్టానికి లోబడే ఉండాలన్నారు. అశ్లీలత, మాదక ద్రవ్యాలు లేకుండా పార్టీలు చేసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. కానీ, పక్కవారి ఫిర్యాదుతో అధికారులు దాడులు చేస్తే దానిని ప్రభు త్వంపై నెట్టడం సరికాదన్నారు. ఉద్యమాలు, నిరసనలపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం లేదని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పునః సమీక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మెరుగైన సేవలు ఏం చేయాలే అవే చేస్తామన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి నేతలు తమ ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని తాము వాటిని స్వీకరిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News