Thursday, January 9, 2025

శ్రీకాంతాచారి ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చుతుంది:మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన అమరుడు శ్రీకాంతాచారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతుందని రాష్ట రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జన సమితి పార్టీ అనుబంధ యువజన విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో యువత పోషించిన పాత్రను గుర్తు చేస్తూ తెలంగాణయూత్ డే సదసుస్సును నిర్వహించింది. సదస్సుకు ముందుగా మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తదితరులు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేయని ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నాతోనే వచ్చిందన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అభాసుపాల అభిప్రాయాలను పటాపంచలు చేయాలని కోరారు. తెలంగాణ సాధనకోసం పోరాడుతున్న ప్రజలకు నాడు సోనియాగాంధీ మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు.

తెలంగాణ డిఎన్‌ఏ ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా అడుగాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను గౌరవించకపోవడం అన్యాయమన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ప్రగతిభవన్‌కు వెళ్ళేందుకు మంత్రులకు కూడా ప్రవేశం లేదని, గద్దర్ వంటి మహానీయులు కూడా ప్రగతిభవన్ గేటు వద్ద అపాయింట్‌మెంట్ కోసం నిరీక్షించారని తెలిపారు. ఎమ్మెల్సీ ప్రొపెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం యువత త్యాగాలతోనే సాధ్యమైందని, వారి ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చడం బన బాధ్యత అని తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో నాడు యువత త్యాగాలు చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపిందని చెప్పారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ పితామహుడిగా కోదండరామ్ పేరు పొందారని కొనియాడారు.

ఈ సదస్సులో విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం అరుణ్‌కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాలను సదస్సు ఆమోదించి, ఈ తీర్మానాలను సిఎం దృష్టికి తీసుకవెళ్ళి వాటి అమలుకు కృషి చేస్తామని మంత్రులు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీమ్‌పాషా, సమితి నాయకులు కొత్తరవి, ఎర్ర వీరన్న, రవినాయక్, పేరాల ప్రశాంత్ శేకర్‌యాదవ్, నరేందర్, వసీమ్, డప్పు గోపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News