Sunday, December 22, 2024

కిషన్ రెడ్డి.. కెసిఆర్ బినామి: మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తుమ్మితే కూలిపోతుందని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి.. మాజీ సీఎం కెసిిఆర్ బినామి అని.. కెసిఆర్ రాసిచ్చిన స్క్రిప్పులనే చదువుతారని ఫైర్ అయ్యారు. సచివాలయంలోని మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన సదస్సుల పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. జనవరి 6వ తేదీ లోపే అందరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోడీ ఎన్నోసార్లు అవమానించారని చెప్పారు. బిజెపి, ఎంఐఎం, బిఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన ఒప్పందం అందరికీ తెలుసన్నారు.  మేడిగడ్డపై సిబిఐ విచారణకు కేంద్రం ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. కెసిఆర్ ను రక్షించడానికే కేంద్రం.. సిబిఐ విచారణను జరిపించడం లేదని దుయ్యబట్టారు. సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి కిషన్ రెడ్డి లేఖ రాయాలన్నారు. కెసిఆర్ వైఖరి వల్లే తెలంగాణకు కేంద్ర నిధులు రాలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కు ఏటిఎం అని బిజెపి పెద్దలు ఆరోపించారని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని అన్నారని.. వీటిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కిషన్ రెడ్డిని మంత్రి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News