Monday, December 23, 2024

ఎంఎల్‌సి కవిత వినతి విడ్డూరంగా ఉంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రతిష్టించాలంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత చేసిన వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కవితకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్టించాలని ఎమ్మెల్సీ కవిత కోర డం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి రాలేదా అని ఆయన ప్రశ్నించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే తమకు సర్వదా స్మరణీయుడు అని చెప్పుకొచ్చారు. “అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని, ఆ మహనీయుడి విగ్ర హం అసెంబ్లీలో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. అణచివేతకు వ్య తిరేకంగా పూలే చేసిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శమన్నారు.

ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ అని పెట్టుకున్నామని, ప్రజలకు ప్రజా పాలన అందిస్తున్నామన్నా రు. మహాత్మా జ్యోతిరావు ఫూలే మాకు సర్వదా స్మరణీయుడన్నారు. బిసిలను వంచించిన మీకు బిసిల సంక్షేమం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మీ నియంతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బిసి మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌ను ఏడిపించింది మీరు కాదా? బిసి బిడ్డగా అడుగుతున్నా. మీ నియోజకవర్గం లో ఎంతమంది బిసిలకు మీరు అధికారాలు ఇ చ్చారు? బిసి మంత్రిగా ఉన్నా తాను ఉద్యమకారుడినేనని, అణగారిన వర్గాలకు ఆప్తుడినని ఆయన తెలిపారు. సబ్బండ కులాలకు సోదరుడినని. మంత్రిగా ఉండి బిసిల హక్కుల కోసం పోరాడతానన్నారు. మీ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక అధ్యక్ష పదవి, లీడర్ ఆఫ్ అపొజిషన్ బిసిలకు ఇవ్వగలరా? గత మీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ బిసిలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని పొన్నం ప్రభాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News