Wednesday, January 22, 2025

ఉచిత బస్సు పథకాన్ని మోడీ జీర్ణించుకోలేక పోతున్నారు:పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తప్పుబడుతూ యూపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని మంత్రి పొన్నం హితవు పలికారు. ఉచిత బస్సు వల్ల నష్టం జరుగుతుందని మోడీ మాట్లాడటం పద్ధతి కాదన్నారు. రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.

ఆర్టీసి, మెట్రో ప్రయాణానికి సంబంధం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. మెట్రో సెక్టార్ వేరని ఆయన చెప్పారు. మెట్రోలో రైలు బోగీలు పెంచాలని ఆయన కోరారు. మెట్రో మనుగడ ముసుగులో ఈ పథకంపై మోడీ తన అక్కసు వెళ్లగక్కారన్నారు. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం మోడీకి సరికాదన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇంకా కొత్త రూట్లను పెంచి కొత్త బస్సులతో పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News