Friday, November 15, 2024

ఆర్టీసి బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసి బస్సులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన బస్సులో ప్రయణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నందిగామ నుంచి షాద్ నగర్ వరకు మంత్రి ప్రయాణం చేశారు. మంత్రి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి కూడా ఈ బస్సులో ప్రయాణం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఉచిత ప్రయాణం, ప్రయాణం వల్ల ఆదా అవుతున్న డబ్బులు తదితర వివరాలు అడిగిన మంత్రి అడిగి తెలుసుకున్నారు.

తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోపు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ, రూ.500లకే గ్యాస్ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణికులతో తెలిపారు. ఈ నెలలో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రయాణికులతో ఆయన తెలిపారు . బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు వస్తున్నాయని ఎవరికి ఇబ్బందులు ఉండవని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్టీసి కండక్టర్ తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బాండ్స్ అమలు చేస్తున్నామని త్వరలోనే పీఆర్సీ అమలుకు చర్చిస్తున్నామని, ఆర్టీసిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News