Monday, December 23, 2024

విడిసి, కుల సంఘాలకు ప్రోసీడింగ్ కాపీలు అందజేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

బాల్కొండ : బాల్కొండ మండలంలోని 7 గ్రామాల కుల సంఘ భవనాల నిర్మాణం కోసం మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను గురువారం వేల్పూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆయా గ్రామాల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు మరియు కుల సంఘాల ప్రతినిధులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు నాయకులు మాట్లాడుతూ కుల సంఘాల అభివృద్ధ్దికి కృషి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీణ్‌రెడ్డి, ఎంపిపి లావణ్యలింగాగౌడ్, జడ్పీటిసి లావణ్య వెంకటేష్, వైస్ ఎంపిపి శ్రీకాంత్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సర్పంచులు భూస సునీత నరహరి, మానేటి తులసి నాగభూషణం, చాట్లపల్లి వనజ గోవర్ధన్ గౌడ్, నాగులపల్లి భూదేవి కిషన్, కర్రె కల్యాణిగంగయ్య, ఎంపిటిసి సభ్యులు కన్న లింగవ్వ పోశెట్టి, ఉప సర్పంచులు షేక్ వాహబ్, సొసైటీ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ గౌడ్, నాగులపల్లి సుభాష్ రాజలింగం, లబ్ది పొందిన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News