Wednesday, January 22, 2025

గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ: మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇళ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి రూ.3లక్షల ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కానీ, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవని, ఆ ఇంటి నంబర్ లేకున్నా, ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దరఖాస్తుదారులు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇళ్లకు పూర్తయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇళ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తామన్నారు. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News