Wednesday, January 22, 2025

విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసేది పురుషాధిక్యతే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పాండిచ్చేరి లోని ఏఐఎన్‌ఆర్‌సీబీజేపీ సంకీర్‌ణ ప్రభుత్వంలో కుల వివక్ష, లింగ వివక్ష, కుట్ర రాజకీయాలు , ధనబలాన్ని తట్టుకోలేకనే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేశానని పాండిచ్చేరి మాజీ మంత్రి చంద్ర ప్రియాంక ఆరోపించారు. పాండిచ్చేరి ప్రభుత్వం లోని ఏకైక మహిళా ఎమ్‌ఎల్‌ఎ, మంత్రి ప్రియాంక. పురుషాధిక్య రాజకీయ ప్రపంచం మహిళలను ఎదగనివ్వదని ఆమె ఆరోపించారు. మహిళలు మహిళలగానే వ్యవహరిస్తారని, మీరెంత విద్యావంతులైనా, గొప్పచరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చినా,

పురుషాధిక్య రాజకీయ ప్రపంచం మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తారని ఆమె ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వూలో ధ్వజమెత్తారు. మీరు మీ విధులను ఎంత సామర్ధంతో చేసినా, గౌరవాన్ని పొందలేరని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 40 ఏళ్ల తర్వాత ఆమె మొదటిసారి 2021లో మహిళా మంత్రిగా స్థానం పొందారు. రంగస్వామి నేతృత్వం లోని సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. తన రాజీనామా లేఖలో తనస్తానంలో దళిత, వన్నియార్ లేదా ఇతర వెనుకబడిన వ్యక్తికి మంత్రి పదవి కల్పించాలని ముఖ్యమంత్రి రంగస్వామిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News