- Advertisement -
ఖమ్మం: ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ లో ఉండి సొంత పార్టీ నేతలనే ఓడించాలని పొంగులేటి కుట్ర చేశారని, పద్ధతి మార్చుకోవాలని సిఎం కెసిఆర్ ఎన్ని సార్లు చెప్పిన ఆయన మారలేదన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డబ్బు , బలగం చూసుకొని విర్రవీగున్నారని, ఏ పార్టీలోకి పోవాలో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. పొంగులేటి ఓ సిద్ధాంతం లేని, విలువ లేని నేత అని, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆయన ఒక బచ్చా అని మంత్రి పువ్వాడ అన్నారు. పేదలను పీడించిన దోపిడిదారులే పొంగులేటి పంచన చేరారని, కాంట్రాక్టులు చేసుకొని ఒక్కడు బాగుపడితే జిల్లా పరిస్థితి ఏంటని ఆయన అన్నారు.
- Advertisement -