- Advertisement -
ఖమ్మం: పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో సిపి విష్ణు ఎస్.వారియర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో పోలీస్ సిబ్బందితో నాటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాలని, హరిత ఖమ్మంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ,జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కలెక్టర్ ఆర్.వి కర్ణన్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, ట్రైనీ ఐపిఎస్ స్నేహ మెహ్రా, అదనపు డిసిపి బోస్, ఎసిపి లు ఆంజనేయులు, రామోజీ రమేష్, సిఐలు, పలువురు సిబ్బంది ఉన్నారు.
minister puvvada ajay kumar planted a thousand plants
- Advertisement -