ఖమ్మం : ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ఉదయం ఖమ్మం కార్పొరేషన్‌లో మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతిలతో కలిసి సైకిల్‌పై పర్యటించారు. అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించాలన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, వినియోగంలో లేని స్థంభాలు తొలగించాలని విద్యుత్ ఎస్‌ఈ ని ఆదేశించారు. అనంతరం 19, 20, 24, 25, 33, 32 డివిజన్లలో పర్యటించి స్థానికులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లలోని చెత్త, త్రాగునీరు సమస్యను మంత్రికి వివరించారు. చెత్తను ప్రతి రోజు తొలగించాలని, ప్రతి రోజు డివిజన్లలోని పారిశుద్ధంపై పై వాకబు చేయాలని మున్సిపల్ కమీషనర్‌ను ఆదేశించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తామని, పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయని వివరించారు. పనుల్లో ఆలస్యం చేయకుండా చూడాలని పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు.
Minister Puvvada cycle tour at Khammam Corporation