Monday, December 23, 2024

షాదీముబారక్, కళ్యాణలక్ష్మిచెక్కులను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/రఘునాథపాలెం: తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ భరోసాగా నిలుస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం రైతు వేదిక వద్ద ఆయన చేతుల మీదుగా లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు లేవని, ప్రతి ఇంట పెళ్ళి కూతురు తండ్రి అప్పులతో బాధపడకుండా ఈ పథకం ద్వారా లక్ష రూపాయలను అందిస్తూ, పెళ్ళి కుమార్తెకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామలా ఆదుకుంటున్నారని అన్నారు.

గతంలో రఘునాథపాలెం 17 పంచాయితీలుగా ఉంటే 37 పంచాయితీలుగా, ప్రతి గిరిజన తండాకు గ్రామపంచాయితీ హోదా కల్పించారని, మంత్రి తెలిపారు. గ్రామాల అభివృద్ది ధ్యేయంగా మంత్రి కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయితీ నుంచి మండల కేంద్రానికి వెళ్ళేందుకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా 60 కళ్యాణలక్ష్మి, 10 షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News