Monday, December 23, 2024

వీరోచిత పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Minister Puvvada Hoists the National Flag at at Khammam

హైదరాబాద్: తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజని, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరవై ఏండ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కారించుకుని ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి పువ్వాడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం ను స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు, స్వాతంత్ర్య సమరయోధులను కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం దళితబందు పథకం ద్వారా మంజూరైన యూనిట్స్ ను ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. వాళ్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఅర్ దార్శనిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఇలా ఐటీ నుంచి అగ్రికల్చర్‌ వరకు అన్ని రంగాలలో యావత్ భారతావనికే తెలంగాణ ప్రభుత్వం దిక్సూచిగా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కేసీఅర్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి తెలంగాణ చిత్తశుద్ది నిరూపించుకుని ఆదర్శంగా నిలిచిందన్నారు.

స్వరాష్ట్రం సాకారంమై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్‌ అనతికాలంలోనే ఈ ప్రాంతం రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సాగునీటి, కరెంటు సమస్యలను తీర్చారని వివరించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ పౌరులు తలెత్తుకొని సగర్వంగా జీవించేలా చేసిన, అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలోనే పూర్తిచేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దినా, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చినా అది సిఎం కేసీఆర్‌ నాయకత్వం వల్లనే సాధ్యమైందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుబంధు పథకం ద్వారా 2 లక్షల 15 వేల 673 మంది రైతులకు ఇప్పటి వరకూ వేయి 667 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంగా అందజేశారని అన్నారు. రైతుభీమా ద్వారా 2 వేల 777 మంది రైతు కుటుంబాలకు 138 కోట్ల 85 లక్షల బీమా పరిహారం చెల్లించామని, దేశంలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకత చాటుకుంటుందన్నారు.

అభాగ్యులకు ఆసరాగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రస్తుతం 2 లక్షల 2 వేల 424 మంది వృద్ధులు, వితంతువులు వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు బీడీ కార్మికులు, వృద్ధ కళాకారులకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించిన ప్రభుత్వం పెన్షన్ దారులకు ప్రతినెల 42 కోట్ల 44 లక్షల రూపాయలను పెన్షన్ల కింద పంపిణీ చేయడం గర్వకారమన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళిత బంధు అని, ఖమ్మం జిల్లా చింతకాని మండలంకు పైలట్ ప్రాజెక్టు గా మొత్తం మండలంకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున మంజూరు చేయగా జిల్లాకు సంబంధించిన గ్రౌండింగ్ పనులు పూర్తి చేసుకున్నామని వివరించారు. సంతృప్తస్థాయిలో దళితులందరికీ దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుందని, కూలీలుగా ఉన్న వారిని యజమానులుగా చేసిన ఘనత కేసీఅర్ కే దక్కుతుందన్నారు.

ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్‌ పాలన తెలంగాణ సంక్షేమానికి ట్రేడ్‌మార్క్ గా మారిందన్నారు. సంక్షేమ పథకాలైన ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు, కల్యాణ లక్ష్మి, గురుకుల పాఠశాలలు, విదేశీవిద్య వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో 35శాతం నిధులను సంక్షేమానికే వెచ్చిస్తున్నా ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అన్నారు. నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, జిల్లా కేంద్ర ఆసుపత్రిని కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా అధునాతన వైద్య పరికరాలను సమకూర్చి ఖరీదైన వైద్య చికిత్సలను అందిస్తున్నామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సాక్షిగా జాతీయ సమైక్యత సమగ్రతను చాటేలా యావత్ భారతావనికే తెలంగాణను దిక్సూచిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. తెలంగాణ సెక్రటేరియట్‌కు జాతి నిర్మాత‌, మహామేధావి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ పేరు పెట్ట‌డం చారిత్రాత్మ‌క నిర్ణ‌య‌మ‌ని, తెలంగాణ ప్రజలందరికీ ఇది గర్వకారణమ‌ని అన్నారు. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఏడాదికి రెండుసార్లు మాత్రమే ఎగురవేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాలుగుసార్లు ఇగురవేసే ఎగురవేసే సందర్భం ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన 15 ఆగస్టు నాడు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరిన జాతీయ జెండాలను దేశవ్యాప్తంగా ఎగురవేస్తారని కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఏటా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున, హైదరాబాద్ రాజ్యం భారత దేశంలో అంతర్భాగం అయిన సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవించుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News