Wednesday, January 22, 2025

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్య సేకరణ పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తల్లాడ: మండలంలోని రేజర్ల గ్రామపంచాయితీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతం శుక్రవారం ప్రారంభించినారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు ఎవరు దళారి వ్యాపారస్తుల చేతిలో నష్టపోకుండా రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, వ్యవసాయ పెట్టుబడి, రైతుబంధు, రైతు పండించిన పంటకు నాణ్యమైన గిట్టుబాటు ధర, రైతుకు నాణ్యమైన విత్తనాలు, అందించడం అనేక కార్యక్రమాలు రైతుల కోసం చేపట్టిందని అని అన్నారు. జిల్లాలో పుష్కలమైన సాగు నీరు, ఉచిత నాణ్యమైన విద్యుత్తు అందించడంతో జిల్లాలో గతంలో కంటే వరి సాగు చాలా పెరిగిందన్నారు.

అధికారుల అంచనాల ప్రకారం ఈ సీజన్ లో 5.37 మెట్రిక్ టన్నుల సాగు చేశారని, ఇందులో 4.03 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంచనాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 230 వరి ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరాన్ని బట్టి ఇంకా కొనుగోలు కేంద్రాలను పెంచుతామని ఆయన అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో స్వేచ్చగా అమ్ముకోవచ్చని, అందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారని వివరించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు పండించిన చివరి గింజను ప్రభుత్వమే కొని వారి ఖాతాల్లో నగదును జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సోములు, వ్యవసాయ శాఖ ఏడి సునీత, మండల వ్యవసాయ శాఖ అధికారి తాజుద్దీన్ తల్లాడ ఎంపిపి దొడ్డా శ్రీనివాసరావు, తహసీల్దార్ గంట శ్రీలత, అధికారులు, వైరా వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, కేతినేని చలపతిరావు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News