- Advertisement -
భద్రాచలం : జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 13వేల కిలో లీటర్ల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ కష్టాలు ఉండవని మంత్రి తెలిపారు. కోవిడ్ బ్లాక్ నందు రోగులను పరామర్శించి, చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు భోజన ప్యాకెట్లను అందజేశారు. అటు కరోనా పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల తీరు మారకపోతే సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. కోవిడ్ నివారణకై జిల్లా సబ్ కలెక్టర్ కార్యక్రమంలో హై-పవర్ కమిటీతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలలో ఆక్సిజన్, బెడ్స్, మెడిసిన్, ఇంటింటికి జ్వరం సర్వేపై అధికారులతో చర్చించారు.M
inister Puvvada inaugurates oxygen production plant
- Advertisement -