హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు పువ్వాడ నయన్ లతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ముందు చూపుతో హరితహరం కార్యక్రమం ద్వారా ముందు తరాలకు ప్రాణ వాయువును వారసత్వంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. దాని కొనసాగింపుగా ఎంపి సంతోష్ గారు కేసీఅర్ గారి ఆశయ సాధన ను పూర్తి స్థాయిలో అమలు జరపడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రకృతిని పరిరక్షించాలని వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. మొక్కల వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.
మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ
- Advertisement -
- Advertisement -
- Advertisement -