Wednesday, January 22, 2025

‘లవ్‌ యూ రామ్‌’లో స్ఫూర్తి, సందేశం రెండూ ఉన్నాయి

- Advertisement -
- Advertisement -

తెలుగు సినీ దర్శక నిర్మాత శ్రీ డీ.వై చౌదరితో కలిసి కె దశరధ్ దర్శకత్వం వహించి నూతనంగా తెరకెక్కిస్తున్న ‘లవ్ యూ రామ్’ చిత్రం టిజర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు సినీ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సినిమాతో దర్శకుడు కె దశరధ్ నిర్మాతగా, కథా రచయితగా రీఎంట్రీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు. ఈ తరానికి కావాల్సిన సందేశం, స్పూర్తి ఈ సినిమాలో ఉన్నాయి అని మంత్రి అన్నారు. చిత్రంలో లవ్ స్టోరీతో పాటు, టీజర్ సినిమాలోని ఎమోషనల్ కోణాన్ని కూడా వర్ణిస్తుంది అని నటీనటులు అపర్ణ జనార్దనన్ మరియు రోహిత్ బెహల్ ఇద్దరూ తమ పాత్రలకు తగినట్లుగా కనిపించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News