Wednesday, January 22, 2025

సిఎంను కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

minister puvvada who met CM KCR with his family

మంత్రి పువ్వాడకి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు

యాదాద్రికి కిలో బంగార విరాళం అందజేయడం పట్ల అభినందన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కి ముఖ్యమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజల తరుపున యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానగోపుర స్వర్ణతాపడానికి కిలో బంగారాన్ని అందజేసిన మంత్రి పువ్వాడని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. మంత్రి అజయ్ తో పాటు వారి సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు నయన్ రాజ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News