Sunday, December 22, 2024

బక్రీద్ వేడుకల్లో మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం గొల్లగూడెం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మంత్రి పువ్వాడ పాల్గొని వారితో పాటు నమాజ్ ఆచరించారు.ఈ సందర్భంగా వారికి ఆత్మీయ ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని అభిలషించారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనందంగా జరుపుకోవాలన్నారు.

జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. బక్రీద్ పుణ్యఫలంతో రాష్ట్రం, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైన ప్రజలు నేడు వేడుకను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News