Monday, December 23, 2024

బాబుతో పవన్ ‘ప్యాకేజీ మిలాఖత్‘ : ఎపి మంత్రి రోజా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :  జనసేన అధినేత పవన్ క ళ్యాణ్ పై ఎపి మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. – జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి కాబట్టే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నారని రోజ వ్యాఖ్యానించారు. గతంలో చెప్పులు చూపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తనని తాను చెప్పుతో కొట్టుకుంటాడా? లేదా ప్రెస్ మీట్ లో పక్కనున్న వాళ్లని కొడతాడా? లేక జనసైనికుల్ని కొడతాడా? అని ప్రశ్నించారు. – పార్టీ పెట్టి పక్కవాడి కోసం తాను పనిచేయడమే కాకుండా తన కార్యకర్తలను కూడా ఇతర పార్టీల జెండాను మోయించే దేశంలోనే ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అని దుయ్యబట్టారు. – జైల్లో ఉన్న ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న దొంగ దగ్గర ప్యాకేజీ తీసుకుని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన అని తీవ్ర ఆరోపణలు చెప్పారు. బిజెపి తో పొత్తులో ఉన్నానంటూనే మోడిని బూతులు తిట్టిన చంద్రబాబు, బాలకృష్ణతో పొత్తు పెట్టుకుంటున్నా నంటున్నాడని దెప్పిపొడిచారు.

పజల కోసం పోరాటం పోరాడని పవన్ కళ్యాణ్ గజదొంగ చంద్రబాబు కోసం పోరాటం చేస్తానని అంటున్నాడని తూర్పారబట్టారు. – కాపుల మీద అక్రమ కేసులు పెట్టి, లాఠీ ఛార్జ్ చేస్తే ఎందుకు రాలేదు? ఎందుకు పోరాటం చేయలేదని రోజా ప్రశ్నించారు. – కేవలం ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు కోసం పనిచేస్తాను, చంద్రబాబును సిఎం చేయడానికే బానిసగా బతుకుతానని సిగ్గు లేకుండా మరోసారి పవన్ కల్యాణ్ ప్రకటించాదని ధ్వజమెత్తారు. – చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తులో కుట్ర కోణం కూడా ఉందని అన్నారు. బాలకృష్ణ చంద్రబాబు సీటులో కూర్చొని టిడిపి క్యాడర్ కు నేనున్నాను, పార్టీని ముందుకు నడిపిస్తానని పిలుపిస్తే. ఆ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఎక్కడా వాటిని ప్రచురించలేదని రోజా అన్నారు. నందమూరి కుటుంబం టిడిపికి నాయకత్వం వహిస్తాం అనే ఆలోచనను కూడా చంద్రబాబు, ఎల్లో మీడియా సహించదని ఆమె అన్నారు. – జనసేన నాయకులను, కార్యకర్తలను ‘అలగాజనం, సంకరజాతి నా కొడుకులు‘

అన్న బాలకృష్ణను ఒకవైపు, తన తల్లిని, తనని అనరాని మాటలు అని, డిబేట్లు పెట్టి, కన్నీళ్లు పెట్టించిన లోకేష్ ను మరోపక్కన పెట్టుకుని సిగ్గులేకుండా ప్రెస్ మీట్ లు పెడుతుంటే జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటో పాపం వారికే అర్థం కావట్లేదని జనసేన కార్యకర్తల మీద అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సింపతీ చూపిస్తున్నారని రోజా అన్నారు. — నాయకుడంటే.. ప్రజల కోసం పోరాడాలి, నమ్ముకున్న నేతలకు, కార్యకర్తలకు గౌరవం కల్పించాలే కానీ, తన ప్యాకేజీ కోసం, దొంగ కోసం నమ్మిన కార్యకర్తలను రోడ్డుమీదకు తీసుకొచ్చిన పవన్ కల్యాణ్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News