Monday, December 23, 2024

టిడిపి నేతలపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

Minister Roja sensational comments on TDP leaders

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ.. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఖాళీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. మూడు ప్రాంతాలు కావాలా, అమరావతి కావాలా అని టీడీపీ నేతలను ప్రశ్నించాలని ఆమె కోరారు. కొడాలి నాని మాటల్లో తప్పేమీ లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం పార్టీని నాశనం చేశాకే తాను, కొడాలి నాని టీడీపీని వీడారని రోజా మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News