Sunday, December 22, 2024

చంద్రబాబు భార్య, కోడలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు: రోజా

- Advertisement -
- Advertisement -

హైదరబాద్: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నయుడు కుటుంబంపై మంత్రి ఆర్కె రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఆయన భార్య, కోడలు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ..”స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో దొరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, ఆయన కోడలు గంట కొట్టండి, విజిల్స్ వేసి జగన్‌కు బుద్ది చెప్పండి అంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా. బ్రాహ్మణి తెలియక మాట్లాడుతోందో.. తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారో తెలియట్లేదు. రాష్ట్రంలో పెద్ద సైకోలు ఎవరంటే.. అది మీ నాన్న బాలకృష్ణ, మీ మామ చంద్రబాబే” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News