Monday, December 23, 2024

హీరోల కంటే జగనన్నే యంగ్ : మంత్రి రోజా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హీరోల కంటే ఎపి సిఎం జగనన్నే యంగ్ అని ఆ రాష్ట్ర మంత్రి, సినినటి రోజా వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో జరిగిన జగనన్న క్రీడా సంబరాల బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మంత్రి రోజా మాట్లాడారు.. క్రీడలు, యువత అంటే సిఎం జగన్‌కు ఎంతో ఇష్టమని అన్నారు. యువతకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరపున జగన్ సహకరిస్తున్నారని తెలిపారు.

పవిత్రమైన ఆశయంతో క్రీడాల పోటీలు, క్రీడా సంబరాలను నియోజకవర్గం, జిల్లా, జోనల్ స్థాయిలో నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. ఎపిలోని గత ప్రభుత్వాలు సక్సెస్ అయిన తర్వాత క్రీడాకారులకు సన్మానాలు చేసేవని అన్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం గ్రామస్థాయ నుంచే క్రీడాకారులకు మంచి గుర్తింపు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News