Thursday, December 26, 2024

6 వర్శిటీల్లో ఫ్రీ కోచింగ్

- Advertisement -
- Advertisement -

Minister Sabita virtually opened competitive examination training centers

పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను వర్చువల్‌గా ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ, పాలమూరు, తె లంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాలను బు ధవారం ఉన్నత విద్యామండలి కా ర్యాలయం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబా ద్రి, వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్ పాల్గొన గా, యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికి యూనివర్సిటీల్లో ఉచితంగా కోచింగ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. వర్సిటీలలో కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చడంతో పాటు పూర్తి సహకారం అందించిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ను మంత్రి అభినందించారు.

రాష్ట్రంలో మొదట పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు తెలిపారు. ఈ మూడు శాఖల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయని అన్నారు. ఒక ఉద్యోగం రాకపోతే మరో ఉద్యోగానికి ప్రయత్నించే విధంగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 91 వేల ఉద్యోగాల ప్రకటన చేసే ముందు ఎంతో కసరత్తు జరిగిందన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారని అన్నారు. జిల్లా గ్రంథాలయాలలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థుల కోసం శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లోని శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు మెటీరియల్ కూడా ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు.

కోచింగ్ సెంటర్ల ఫీజులపై కమిటీ

పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్న కేంద్రాలలో ఫీజుల నియంత్రణకు కమిటీ నియమించి అధ్యయనం చేయనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణ అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News