Monday, December 23, 2024

కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతిపై మంత్రి సబితా దిగ్భ్రాంతి..

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్, పరిగి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన హరీశ్వర్ రెడ్డి మరణం బిఅర్ఎస్ పార్టీకి, జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా జిల్లా అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News