Thursday, January 23, 2025

ఎంతటి వారైనా వదిలేది లేదు: సబితా ఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో రాజకీయాలు చేయటం నీతిమాలిన చర్య అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేపర్ లీకేజీల వ్యవహారం తాండూరు,వరంగల్లోజరిగిన పదవ తరగతి పేపర్ పరీక్ష సమయంలో బయటికి రావడం బాధాకరం. టి ఎస్ పీఎస్ పరీక్ష పత్రం లికేజ్ నుంచి నిన్న జరిగిన పదవ తరగతి హిందీ పేపర్ లికేజ్ వరకు కుట్ర కోణం దాగివుందని,రాష్ట్రంలో 9 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతో నే పేపర్ లికేజీలు సృష్టించి విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళనకు గురి చేశారు.కేంద్రంలోని బీజేపీ పెద్దప పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుట్ర చేశారని వారి కుట్రలు భగ్నం చేసాము అని, మీ స్వార్ధ రాజకీయాల కోసం ఐదు లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడటం బావ్యం కాదని ఆరోపించారు.

గ్రూప్-1 టి ఎస్ పీఎస్ రాజశేఖర్, పదవ తరగతి పేపర్ లికేజ్ లో పాత్ర ఉన్న ప్రశాంత్ లకు బీజేపీ నాయకులతో సంబంధాలు వున్నాయి. అన్ని విషయాలు త్వరలో బహిర్గతం అవుతాయని తెలిపారు. అదేవిదంగా వికారాబాద్ జిల్లా తాండూరులో పదవ తరగతి పేపర్ లికేజీ చేసిన టీచర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యులు అని తెలుస్తుంది. విద్యా బుద్దులు నేర్పాల్సిన టీచర్ ఇలా విద్యార్థుల జీవితంలో అలజాడి సృష్టించేలా చేయడం సిగ్గు మాలిన చర్యగా భావించవచ్చు. బిజెపి పార్టీ తప్పులు చేస్తూ గగోలు పెడితె తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేరని గుర్తించాలి. పరిగి పర్యటనలో ఉన్న నన్ను అడ్డుకోవాలని విద్యార్థులను, నిరుద్యోగులను ఉసిగొల్పడం వారి విజ్ఞతకే వదిలేస్తున్న. వారి పార్టీ అధ్యక్షుడు చేసిన నీతిమాలిన పనికి ఏ మొహం పెట్టుకొని అడ్డుకోవాలనుకున్నారు వారికే తెలియాలి.

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలను కునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మొదటిరోజు జరిగిన తప్పిదాన్ని దృష్టిలో ఉంచుకొని జరగబోయే నాలుగు పరీక్షలకు అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్, పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుశీల్ గౌడ్, జిల్లా రైతు సంఘము అధ్యక్షులు రామ్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు లంక లక్ష్మీకాంత్ రెడ్డి, కడియాల వేణు, శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News