Friday, December 27, 2024

బాసర ఆర్‌జియుకెటిలో వరస ఘటనలు బాధాకరం

- Advertisement -
- Advertisement -

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో జరుగుతున్న విద్యార్థినిల ఆత్మహత్యలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాసర ఆర్జీయూకేటీలో వరస ఘటనలు బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దీపిక మృతిపై కమిటీ వేశాం, విచారణ జరుగుతోందని మంత్రి సబిత వెల్లడించారు. లిఖిత మృతిపై ఇంకా పూర్తి సమాచారం లేదని మంత్రి తెలిపారు.

పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని సూచించారు. బాసరలోని తాజాగా మరో విద్యార్థిని మృతి చెందింది. ఆర్‌జియుకెటి పియుసి మొదటి సంవత్సరం చదువుతున్న లిఖితి చనిపోయింది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బిల్డింగ్ పై నుంచి విద్యార్థిని కిందపడింది. వసతి గృహం నాలుగో అంతస్తు నుంచి కింది పడి విద్యార్థిని దుర్మరణం చెందింది. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం. తీవ్రంగా గాయపడిన ఆమెను వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లిఖిత మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News