- Advertisement -
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం కలిసి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బిజిపి నాయకుల దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లిన మంత్రి సబితా కవితను పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో దాడులు సమంజసం కాదని, ఒక మహిళ నేత ఇంటిపై ఈ విధమైన చర్యకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గాంధీ ,జిల్లా పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి,ఎమ్మెల్యేలు యాదయ్య ,ప్రకాష్ గౌడ్ ,రోహిత్ రెడ్డి ,అంజయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -