Monday, January 20, 2025

మంత్రాల చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు సుందరీకరణ, కట్టపై వాకింగ్‌ట్రాక్, వీధివ్యాపారుల కోసం షెడ్ల నిర్మాణ పనులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే పట్లోళ్ల సబితఇంద్రారెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ కాంక్రీట్ జంగిల్స్‌గా మారుతున్న నగర ప్రాంతాల్లోని చెరువులను ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న, పెద్ద సేదదీరేందుకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

ఇప్పటికే సందచెరువును మినీట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేశామని, అదేవిధంగా మంత్రాల చెరువు పనులను త్వరితగతిన పూర్తిచేసి సుందరీకరణ, వాకింగ్‌ట్రాక్, వీధివ్యాపారుల షెడ్లను ప్రజావినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్ ఇంద్రావత్ రవినాయక్, కోఆప్షన్ సభ్యుడు పల్లె జంగయ్యగౌడ్, కమీషనర్ చిట్టి నాగేశ్వర్, డిఈఈ గోపినాధ్, కార్పొరేషన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, నాయకులు ముడావత్ దీప్‌లాల్, నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News