Saturday, December 28, 2024

మోడీజీ సిలిండర్ తీసుకుపో.. కట్టెల పొయ్యి ఇచ్చిపో: మంత్రి సబిత

- Advertisement -
- Advertisement -

Minister Sabitha Mahadarna on gas cylinder price hike

మహేశ్వరం : తరుచుగా పెంచుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర బిజిపి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో మహా ధర్నా నిర్వహించనున్నారు. పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై ఈ పెంపు పెనుభారంగా మారిందన్నారు. ప్రజలకు రోజు వారీగా ఆర్థిక కష్టాల పాలు జేస్తున్న సిలిండర్ ధరల పెరుగుదలకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ఈ నెల 15 న సాయంత్రం 4 గంటలకు మహా ధర్నా జరుగనుంది. ప్రధాని మోడీ వల్ల కట్టెల పోయ్యి మహిళలకు దూరం అయిన కన్నీటి కష్టాలు మళ్ళీ మొదలవుతున్నాయని,గ్యాస్ సిలిండర్ ధర పెంపు గుదిబండగా మారటంతో,యావత్ మహిళ లోకం తరుపున మంత్రి ఈ ధర్నా చేపట్టనున్నారు. మోడీజీ సిలిండర్ తీసుకుపో….కట్టెల పోయ్యి ఇచ్చిపో అనే విన్నూత్న నినాదం తో ఈ నిరసన కార్యక్రమాన్నీ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News