Saturday, November 23, 2024

చెరువు చుట్టూ ఆక్రమణలను తొలగిస్తాం: మంత్రి సబితా

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని గగన్ పహాడ్ అప్పా చెరువును రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గులాబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అప్పా చెరువులోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో మంత్రి సబితా మంగళవారం ఉదయం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి చెరువును సందర్శించారు. చెరువు కట్ట రిపేర్ వర్క్స్ ను తొందరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తాం. గతేడాది కూడా ఈ అప్ప చెరువు కట్ట తెగి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వచ్చే ఏడాది వరకు ఎలాంటి కబ్జాలు లేకుండా చెరువుకు సరైన కాల్వ తీస్తాం. మణికొండలో రజినీకాంత్ అనే వ్యక్తికి డ్రైనేజీ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసి కూడా డ్రైనేజీలో పడ్డాడు. చెరువులు నిండి వరదలు వచ్చినపుడు స్థానికులు అధికారులకు సహకరించాలి. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తాం” అని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. గతేడాదితోపాటు ఈ ఏడాది కూడా అనుకున్నదనికన్నా ఎక్కువ వర్షాలు కురిసాయన్నారు. చెరువు కట్ట తెగకుండా మరమ్మతులు చేస్తున్నామని, కబ్జాలు చేసిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించమని అధికారులకు చెప్పామని తెలిపారు.

Minister Sabitha Reddy inspects Appa Cheruvu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News