Monday, March 10, 2025

ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత

- Advertisement -
- Advertisement -

Minister Sabitha released TS EAMCET results

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ… ఇంజినీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని… కళాశాలల వివరాలు, కోర్సుల వివరాలు కౌన్సిలింగ్ సెంటర్ లో వెల్లడిస్తారని తెలిపారు. మరోవైపు ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,812 మంది… అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల పరీక్షలకు 80,575 మంది హాజరయ్యారని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News