హైదరాబాద్: వాట్సాప్ లో హిందీ ప్రశ్నపత్రం వైరల్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ప్రశ్నపత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ, డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. నిజాలు తేల్చేందుకు సిపికి ఫిర్యాదు చేయాలని డీఈవోలకు మంత్రి ఆదేశించారు. ప్రశ్నపత్రం ఎక్కడ్నుంచి వచ్చిందనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సూచించారు.
4.95 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని మెలగాలన్నారు. కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు సమన్యయంతో పనిచేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, పోలీసులు సమన్యయంలో పనిచేయాలని మంత్రి సబిత పేర్కొన్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురి చేయెద్దని ఆమె తెలిపారు. రాజకీయ స్వార్థం, వ్యక్తిగత స్వార్థం వీడాలని పిలుపునిచ్చారు. పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు మంత్రి సబిత విజ్ఞప్తి చేశారు.