Monday, December 23, 2024

పల్లెల్లో రైతుబంధు సంబరాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతుబందు సంబరాల్లో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నారాయణ పురం గ్రామంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్య అతిధిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో రైతు బంధు వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి మండలం రాఘవపూర్, జులపల్లిలో ఎడ్ల బండ్లతో ర్యాలీ తీసి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి రైతులు, గ్రామస్తులు, తెరాస నాయకులతో కలిసి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి పాలాభిషేకం చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో రైతు సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎడ్ల బండి, ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, జిల్లా రైతు అధ్యక్షులు వంగేటి లక్ష్మా రెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడిపారు.

Minister Sabitha tractor rally in Maheshwaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News