Monday, December 23, 2024

వారి ఒత్తిడితోనే బిల్లు తెచ్చాం: టెకీల పని గంటల పెంపుపై మంత్రి వివరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐటి ఉద్యోగులకు అదనపు పని గంటలు దిధించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఐటి పరిశ్రమ నుంచి ప్రభుత్వంపై ఒత్తడి ఉందని కర్నాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ వెల్లడించారు. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. రోజుకు 14 గంటల పాటు ఐటి ఉద్యోగులు పనిచేసేందుకు అనుమతిస్తూ రూపొందించిన బిల్లును ప్రభుత్వం ఇంకా పరిశీలిస్తోందని సోమవారం శాసనసభ వద్ద విలేకరులకు ఆయన తెలిపారు. ఐటి పరిశ్రమ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ఈ బిల్లు రూపొందిందని ఆయన చెప్పారు.

ఊటి ఉద్యోగులకు అదనపు పని గంటలు పెట్టాలన్నది ఐటి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే సొంత ఆలోచన కాదని ఆయన వివరించారు. ఐటి పరిశ్రమ నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే ఈ బిల్లు రూపొందిందని, కార్మిక శాఖ దృక్కోణంలో దీన్ని పరిశీలిస్తున్నామని సంతోష్ చెప్పారు. ఈ అంశం ప్రజల ముందుకు వచ్చిన దృష్టా దీనిపై పరిశ్రమ అధిపుతలందరూ చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించాలని ఆయన కోరారు. దీనిపై సబంధిత భాగస్వామ్యపక్షాలన్నీ చర్చించాలని ఆయన సూచించారు. ఐటి ఉద్యోగులలో ఈ ప్రతిపాదనపై అసమ్మతి ఉందని ఆయన తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దాని ఆధారంగా కార్మిక శాఖ దీనిపై ఒక నిశ్చితాభిప్రాయానికి రాగలదని ఆయన చెప్పారు.

ఐటి ఉద్యోగుల వ్యకిగత, సాంఘిక జీవితం గురించి ప్రశ్నించగా దీనిపై ఐటి అధిపతులు, బడా కంపెనీల నాయకులు చర్చించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఐటి ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశాలపై చర్చించాల్సిన అవసరం ఐటి కంపెనీలు, వాటి యజమానులు, డైరెక్టర్లకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఐటి ఉద్యోగుల పని గంటలు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వానికి కాదని, ఐటి శాఖ కాని కార్మిక శాఖ కాని దీనిపై వివేచనతో నిర్ణయం తీసుకుంటాయని ఆయన వివరించారు. కాగా..ఐటి ఉద్యోగుల పని గంటలను 14 గంటలకు పెంచాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లును కర్నాటక రాష్ట్ర ఐటి ఉద్యోగుల సంఘం(కెఐటియు) తీవ్రంగా వ్యతిరేకించింది. దీని వల్ల్ల ఐటి ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్య, వారి ఉద్యోగ జీవిత సమతుల్యం దెబ్బతింటాయని కెఐటియు ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News